పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Categories
Janmakundali
మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులు

 మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులు

ఈ మాసం లో శ్రవణా నక్షత్రం రోజున తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే సకలపాపాలు తొలగుతాయి. 

మాఘ తదియ రోజున బెల్లం, ఉప్పు దానం చేస్తే ఎంతటి కష్టాల నుండి అయినా విముక్తి లభిస్తుంది 

మాఘ శుద్ద చతుర్ధి ని తిలచతుర్ధి అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి గణపతి ని పూజించి జాగరణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజున నువ్వులను బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇస్తే సర్వపీడలు తొలగి బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది ఈ చతుర్ధి ని కుంద చతుర్ధి అని కూడా అంటారు. కుంద చతుర్ధి రోజున శివున్ని మొల్లలు తో పూజించి ఒంటిపూట భుజిస్తే ఐశ్వర్య ప్రాప్తి ,సిరిసంపదలు కలుగుతుంది 

సంకటహర చతుర్థి  నాడు సాయంత్రం వరకు ఉపవసించి సంధ్యా సమయం లో గణపతి ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

శ్రీ పంచిమి రోజున సరస్వతి ని పూజిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. ముఖ్యం గా విద్యలకు అధిపతి అయిన సరస్వతి దేవి ని విధి విధానం గా విద్యార్దులు పూజిస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది.  చదువు లో చక్కటి ప్రతిభ కనబరుస్తారు. సరస్వతి దేవి కి ప్రీతికరమైన తెల్లని పుష్పాలతో పూజించి, క్షీరాన్నం, నారికేళం, చెరుకు వంటి పదార్దాలను నివేదన చేస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

రథసప్తమి రోజున వేకువ ఝామున నిద్రలేచి జిల్లేడు ఆకులు, ఎర్రటి అక్షితలు తలపైన, భుజాల పైన ఉంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున సూర్యనారయణుడి స్వామి ప్రసన్నం కొరకు తూర్పు దిక్కుగా పొయ్యి మీద పాలు పొంగించాలి. చిక్కుడుకాయలతో చేసిన రథం పై సూర్య భగవానుణ్ణి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. రథసప్తమి వ్రతం ఆచరించిన వారికి దారిద్ర్య బాధలు తొలగుతాయి. ప్రయాగ లో ఈ వ్రతం ఆచరిస్తే కోటి సూర్య గ్రహణాల పుణ్య ఫలం లభిస్తుంది. 

రాగి పాత్రలో సూర్య బింబ ప్రతిమ ఉంచి ఎర్రటి పూలతో అర్చించి బ్రాహ్మణునికి ప్రతిమ సహితం గా దానం ఇస్తే, జాతకరీత్య సూర్య గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజున అరుణ పారాయణం చేస్తే హృదయ  సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, చర్మవ్యాదులు తొలగుతాయి. ఈ రోజున శివ సన్నిధి లో మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు భయాలు తొలగుతాయి.

భీష్మాష్టమి రోజున భీష్మాచార్యులకు ఆర్ఘ్యం ఇచ్చి పూజిస్తే వంశం వర్ధిల్లుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుశ, తిల, జలము తర్పణ  చేస్తారో వారి కి సుందర సుగుణవంతులైన  సంతానము ప్రాప్తిస్తుంది. ఈ విధి నిర్వహించిన వారికి ఆ సంవత్సరం లో చేసిన పాపాలు తొలగుతాయి.

కృత్తిక నక్షత్రం ఉన్న రోజున సుబ్రమణ్యస్వామి కి పాలాభిషేకం చేస్తే సర్పగ్రహ బాధలు, రాహు కేతు బాదలు తొలగుతాయి. సంతాన లేని వారు పుట్టలో పాలు పోసి సర్పాకారం లో సుబ్రమణ్య స్వామి ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది 

భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది 

తిల ద్వాదశి నాడు నువ్వుల తో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనె తో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి. 

శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, దక్షిణ తో సహా బ్రాహ్మణునికి  దానం ఇచ్చి, శివలింగానికి తైలాభిషేకం చేయించడం  వలన శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా ఏలిన నాటి శని, అర్దాష్టమ శని, శనిమహర్దశ అంతర్దశ జరుగుతున్నా వారు వీటిని ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది.  

మాఘ పౌర్ణమి రోజున మాఘ మాసం లో ప్రతి నిత్యం స్నానమాచరించలేని వారు ఈ ఒక్క రోజు మాఘ స్నానం ఆచరిస్తే శుభం కలుగుతుంది. దైవ శక్తి సంపూర్ణం గా విలసిల్లే దివ్యమైన రోజున చేసే జపాలు, పూజలు, దానాలు, హోమాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున చేసే సముద్ర స్నానం చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానమిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయం లో ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని గ్రహాల బాధలు తొలగుతాయి.  పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి.  

విశాఖ నక్షత్రం రోజున సుబ్రమణ్య స్వామి ని భస్మం తో పూజిస్తే పాపక్షయం కలుగుతుంది, బిల్వపత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. స్వామివారికి వస్త్రాలు సమర్పించి పూజించి  ఉపవాసం చేస్తే ఉద్యోగ మార్గాలు లభిస్తాయి. 

విజయ ఏకాదశి - శ్రీ రామచంద్రుడు లంకను చేరుకోవడానికి సేతువు నిర్మించడం పూర్తైన రోజు కావున విజయ ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే విజయాలు ప్రాప్తిస్తాయి.

మహా శివరాత్రి పర్వదినాన శివారాధన, రుద్రాభిషేకం, జాగరణ, ఉపవాసం ఏది చేసిన పుణ్యం లభిస్తుంది. విభూది, రుద్రాక్ష ధారణ వలన మంచి ఫలితాలు పొందుతారు. శివ పార్వతుల కల్యాణం చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ దోషాలు ఉన్న వారికి దోషాలు తొలగి వివాహం జరుగుతుంది.