పంచాంగం...సోమవారం, 27.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి  శు.పాడ్యమి రా.8.01 వరకు నక్షత్రం శతభిషం ఉ.7.34 వరకు తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం ప1.51 నుంచి 3.27 వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.21 వరకు తదుపరి ప.3.01 నుంచి 3.51 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు.
Categories
Janmakundali
శ్రీదుర్ముఖినామ సంవత్సర ఫలితాలు

 శ్రీదుర్ముఖినామ సంవత్సర ఫలితాలు 

ఏడాది శుభుడైన శుక్రుడు రాజుగానూ, బుధుడు మంత్రి, సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతిగానూ, శని సస్యాధిపతి, నీరసాధిపతిగానూ, శుక్రుడు ధాన్యాధిపతిగానూ, చంద్రుడు రసాధిపతి గానూ ఉంటారు. నవనాయకుల్లో ఏడుగురు శుభులు కాగా, మిగతా ఇద్దరు పాపులు. అలాగే, ఉపనాయకులు 21మందిలో 10మంది శుభులు, మిగతా వారు పాపులుగా ఉంటారు.

రాజు శుక్రుడు, మంత్రి బుధుడు కావడం, ఇద్దరు మిత్రులు కావడం అనుకూలమే. కేంద్ర, రాష్ట్రాల పాలనా రంగంలో కొన్ని సమస్యలు  ఎదురైనా అధిగమించి ప్రజలకు అనుకూల పాలనే అందుతుంది. నువ్వులు, నల్ల రేగడి భూముల్లో పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో సకాలంలో ఆశించినంతగా వర్షాలు పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రజలు విలాసవంతంగా జీవిస్తారు. పాల ఉత్పత్తులు పెరిగి రంగంపై ఆధారపడిన వారికి చేతి నిండా పని లభించడమే కాకుండా ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. బుధుడు మంత్రి కావడం వల్ల గాలులుమేఘాలతో ఆకాశం కారు మబ్బులుగా మారి వర్షాలు పడతాయి.

మొత్తం మీద పరిశీలించగా ఏడాది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు తీసుకున్న  కొన్ని నిర్ణయాలు ప్రజలను ప్రభావవంతం చేస్తాయి. వారి తిరస్కారానికి గురవుతాయి. దీనిరీత్యా  శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే అవకాశం. కొన్ని ప్రాంతాలలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజా జీవనానికి ఆటంకం కలిగే అవకాశం. అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదాలు ఏర్పడి పాలనా రంగంపై ప్రభావం చూపవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారవచ్చు. ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలు ఎదురై సైనిక చర్యలకు దారితీయవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి పథంలో సాగుతాయిఐటీ పరిశ్రమకు మంచిరోజులు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయరంగం ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అనుకున్న గిట్టుబాటు ధరలు రైతులు నిరాశ చెందుతారు. వాణిజ్య పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. తూర్పు, ఉత్తర ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి. ఇతర ప్రాంతాలలో దుర్భిక్ష పరిస్థితులు. సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు అయినందున నువ్వులు, బార్లీ వంటి తెల్ల ధాన్యాల దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో విస్తృతంగానూ దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో సామాన్య వర్షాలు కురుస్తాయి. బంగారం, వెండి, రాగి వంటి లోహాల ధరలు పెరిగే సూచనలు.

ఏడాది రాజు శుక్రుడు అయినందున మొత్తం నాలుగు కుంచాల వర్షం కురుస్తుంది. ఇందులో 8 భాగాలు సముద్రంలోనూ, 9 భాగాలు పర్వతాలపైన, 3 భాగాలు నేలపైన పడుతుంది. వర్ష లగ్నం కన్యరాశి . లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రునితో కలిసి అష్టమస్థానంలోనూద్వితీయ, భాగ్యాధిపతి శుక్రుడు