పంచాంగం...సోమవారం, 27.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి  శు.పాడ్యమి రా.8.01 వరకు నక్షత్రం శతభిషం ఉ.7.34 వరకు తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం ప1.51 నుంచి 3.27 వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.21 వరకు తదుపరి ప.3.01 నుంచి 3.51 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు.
Categories
Janmakundali
ఉగాది కృత్యం

 ఉగాది కృత్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం రీత్యా పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఏడాది దేశ కాలమాన పరిస్థితులుజాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో  కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు  కార్యసిద్ధికి తోడ్పడతాయి. పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది.

చాంద్రమాన ప్రకారం సంవత్సరాన్ని శ్రీదుర్ముఖినామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 30వది దుర్ముఖినామ సంవత్సరం. అధిపతి రుద్రుడు, రుద్రుని ఆరాధించిన సకల సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే, రజతదానం మంచిది.

 

 

కర్తరులు..

చైత్ర బహుళ ద్వాదశి తత్కాల త్రయోదశి, బుధవారం, అనగా మే 4 నుంచి డొల్లు కర్తరి (చిన్న కర్తరి) ప్రారంభం.

వైశాఖ శుక్ల పంచమి, బుధవారం అనగా మే 11 నుంచి నిజ కర్తరి(అగ్నికర్తరి) ప్రారంభం.

వైశాఖ బహుళ సప్తమి, శనివారం అనగ మే 28 కర్తరి పరిసమాప్తమవుతుంది. కర్తరీ కాలంలో శంకుస్థాపనలు, గృహ నిర్మాణాలు చేయరాదు.

మూఢములు

గురు మూఢమి... భాద్రపద శుక్ల ఏకాదశి, సోమవారం, అనగా సెప్టెంబర్ 12 తేదీ నుంచి గురుమూఢమి ప్రారంభం.

ఆశ్వయుజ శుక్ల నవమి, సోమవారం అనగా అక్టోబర్ 10 తేదీన మూఢమి సమాప్తం.

శుక్ర మూఢమి... చైత్ర బహుళ నవమి, ఆదివారం అనగా మే 1 నుంచి మూఢమి ప్రారంభం.

ఆషాఢ శుక్ల అష్టమి, మంగళవారం అనగా జూలై 12 మూఢమి సమాప్తమవుతుంది.

తిరిగి ఫాల్గుణ బహుళ అష్టమి, సోమవారం అనగా మార్చి(2017) 20 నుంచి మూఢమి ప్రారంభం.

శ్రీ హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల చవితి శుక్రవారం అనగా మార్చి(2017) 31 ముగుస్తుంది.

 

మకర సంక్రమణం....

పుష్య బహుళ విదియ, శనివారం అనగా 2017 జనవరి 14 ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మకర రాశిలో పగలు 12.48గంటలకు  రవి ప్రవేశం. మకర సంక్రాంతి అయిన ఈ రోజున దానధర్మాల