పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

aquarius

22nd Jan 2017   -    28th Jan 2017

 కుంభం

పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పరిచయాలు పెరుగుతాయి.వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. సొమ్ము  అంది అవసరాలు తీరతాయి. రుణాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధించినా క్రమేపీ ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీ యోగం, విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబసమస్యలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్ ఛాలీసా పఠించండి.