పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Weekly Horoscope

aries

19th Feb 2017   -    25th Feb 2017

 మేషం

ఒక వైపు ఆదాయం తగ్గి, మరో వైపు రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.

మీ సహనాన్ని పరీక్షించే విధంగా మిత్రులు వ్యవహరిస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

కొన్ని విషయాలలో అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది.

మీ పై ఉంచిన బాధ్యతలు భారంగా మారి ఒక దశలో చికాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్ధాలు, వివాదాలు నెలకొంటాయి.

కొన్ని కార్యక్రమాలను ఊహించని విధంగా వాయిదా వేస్తారు.

ఆరోగ్యం పై ప్రధానంగా దృష్టి సారించండి.

విద్యార్థులు,నిరుద్యోగులకు నిరుత్సాహం.

వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.

వ్యాపారాలు కొంత నిరాశ కలిగించడమే కాకుండా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి

రాజకీయ నాయకులు, డాక్టర్లకు మానసిక అశాంతి, ఒడిదుడుకులు.

వారం చివరిలో కొంత అనుకూల ప్రభావం ఉంటుంది

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీస్తుతి మంచిది.