పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

cancer

22nd Jan 2017   -    28th Jan 2017

 కర్కాటకం

ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. భూముల లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సొమ్ము అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. శుభ కార్యాలు నిర్వహిస్తారు. కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. పెట్టుబడులకు ఢోకా లేదు. ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో చికాకులు. పనుల్లో జాప్యం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి