పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

capricorn

22nd Jan 2017   -    28th Jan 2017

 మకరం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెండింగ్ బాకీలు అందుతాయి. అవసరాలు తీరతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో లాభాలు ఊరటనిస్తారు. విస్తరణ యత్నాలలో పురోగతి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీస్తుతి మంచిది.