పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

gemini

22nd Jan 2017   -    28th Jan 2017

 మిథునం

రహస్య విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగు చూసి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు. సభలు,సమావేశాలలో పాల్గొంటారుచిన్ననాటి మిత్రుల ద్వారా శుభ వార్తలు అందుతాయి. గతంలో చేజారిన అవకాశాలు నిరుద్యోగులు తిరిగి దక్కించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. రుణాలు తీరతాయి. కుటుంబ సమస్యల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు. శుభకార్యాల పై చర్చలు. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడుల దిశగా సాగుతారు. ఉద్యోగుల పై వచ్చిన అపవాదులు తొలగుతాయి. సమర్థత చాటుకుంటారు. కళాకారులు, రాజకీయ రంగాల వారికి కలసివచ్చే సమయం. వారం మధ్యలో చికాకులు. మానసిక అశాంతి

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.