పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Weekly Horoscope

leo

26th Feb 2017   -    04th Mar 2017

 సింహం

మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

మీ సహనం మీకు రక్షగా నిలుస్తుంది.

ప్రతిభాశీలురుగా గుర్తింపు లభిస్తుంది.

పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు.

అనుకున్న రాబడి దక్కుతుంది. రుణ బాధలు తొలగుతాయి.

వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఆరోగ్యం కొంత మందగిస్తుంది.

నిరుద్యోగులు,విద్యార్థులకు కొంత వరకూ అనుకూలం.

వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ఉద్యోగులకు అనుకోని హోదాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం మధ్యలో కుటుంబ చికాకులు. మానసిక అశాంతి

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం చేయండి.