పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

libra

22nd Jan 2017   -    28th Jan 2017

 తుల

ఇంత కాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మీద వేసుకుని సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు పెరుగుతారు. నిరుద్యోగులకు పరీక్షా సమయమే. వాహనాలు విషయంలో అప్రమత్తంగా ఉండండి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు పెరుగుతారు. కొంత సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. ముఖ్యంగా నేత్ర, చర్మ వ్యాధులు బాధిస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అతికష్టం పై దక్కుతాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయిఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. పై స్థాయి వారితో మాటపడతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం.

వారం మధ్యలో శుభ వార్తలు

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి..