పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Weekly Horoscope

scorpio

19th Feb 2017   -    25th Feb 2017

 వృశ్చికం

ఈ వారం అనూహ్యమైన రీతిలో సొమ్ము అందుతుంది.

భార్యాభర్తలు, సోదరీసోదరుల మధ్య నెలకొన్న విభేదాలు తొలగుతాయి.

చేపట్టిన కార్యాలలో విఘ్నాలు తొలగి ముందడుగు వేస్తారు.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రతిభావంతులుగా మంచి గుర్తింపుతో పాటు, విశేష ఆదరణ పొందుతారు.

వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు.

స్నేహాలు విస్తరిస్తాయిఆలయాలు సందర్శిస్తారు.

వివాహాది వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు.

ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది.

వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి.

ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది.

సాంకేతిక నిపుణులు, నాయకులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో చికాకులు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాల పఠనం ఉపయుక్తమైనది.