పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

virgo

22nd Jan 2017   -    28th Jan 2017

 కన్య

ఇతరుల మెప్పుకోసం తాపత్రయ పడతారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు.

శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సన్నిహితులు కొంత సహాయపడతారు. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అప్పులు చేయాల్సివస్తుంది. కుటుంబంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతాయి. మీపై విమర్శలు పెరుగుతాయి. ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఔషధ సేవనం. వ్యాపారాల్లో అనుకున్నంతగా లాభాలు దక్కక డీలా పడతారు. ఉద్యోగులకు అనూహ్యంగా మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికకళారంగాల వారు కొంత ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో విందువినోదాలు. కార్యజయం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీస్తుతి మంచిది