Weekly Horoscope
15th April, 2018 to 21st April, 2018
Aries
మేషం
కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
అనుకున్నది సాధించాలన్న తపనతో కార్యన్ముఖులు కాగలరు.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
విద్యార్థులు, నిరుద్యోగులకు ఒక ప్రకటన వరంగా మారుతుంది.
వస్తులాభాలు ఉంటాయి.
వ్యాపారాలు మరింత రాణిస్తాయి.
ఉద్యోగులకు అనుకున్న మేరకు లక్ష్యాలు నెరవేరతాయి.
పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలీకృతమవుతాయి.
మహిళలకు శుభవార్తా శ్రవణం.
షేర్ల విక్రయాలలో లాభాలు.
అశ్వని వారికి సోమవారం వ్యయప్రయాసలు. చోరభయం. బుధవారం కీలక నిర్ణయాలు. ఉద్యోగలాభం.
భరణి వారికి మంగళవారం ధన నష్టం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. శుక్రవారం విందులువినోదాలు. కార్యజయం.
కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గా స్తోత్రాలు పఠించండి.