పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Virgo

కన్య ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మీ అభిప్రాయాలను బంధువులు గౌరవిస్తారు. ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుంటారు. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు కొత్త అనుమతులు, లైసెన్సులు దక్కించుకుంటారు. కళాకారులకు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల విక్రయాలలో అధికలాభాలు. ఉత్తర 2,3,4 పాదాల వారికి బుధవారం ధన నష్టం. కుటుంబంలో కలహాలు. శనివారం విందువినోదాలు. అరుదైన సన్మానాలు. హస్త వారికి సోమవారం వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. గురువారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. చిత్త 1,2 పాదాల వారికి మంగళవారం వివాదాలు. చోర భయం. ఒప్పందాలు వాయిదా. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces