పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

aquarius

01st Jan 2017   -    31st Dec 2017

 కుంభం...(జనవరి 21–ఫిబ్రవరి 18)

ఎంతటి కార్యామైనా విజయవంతంగా ముగిస్తారు. దూరపు బంధువుల ప్రోద్బలంతో ముందడుగు వేస్తారు. వివాహా యత్నాలు కలిసి వస్తాయిచిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి మీకు చేదోడుగా నిలుస్తారు. ఆదాయం విషయంలో కొంత అసంతృప్తి ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. సెప్టెంబర్‌ వరకూ ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు తొలగుతాయి. ద్వితీయార్థంలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కి ఉత్సాహంగా ఉంటారు. వ్యవసాయదారులకు కొత్త ఆశలు.

అదృష్ట సంఖ్య 8. వీరు సుబ్రహ్మణ్యారాధనచేయాలి.