పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Yearly Sunsign Horoscope

aries

01st Jan 2017   -    31st Dec 2017

 మేషం...(మార్చి 21–ఏప్రిల్‌20)

రాశి వారికి జనవరి చివరి నుంచి సమస్యల నుంచి విముక్తి. ఈతి బాధలు తొలగే సూచనలు. కష్టసుఖాలు సమాన స్థాయిలో  స్వీకరించే గుణం అలవడుతుంది. దైవారాధనలో నిమగ్నమవుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు చాలా వరకూ సర్దుబాటు కాగలవు. ఇక ఆదాయం కొంత ఇబ్బంది కలిగించినా ద్వితీయార్థం నుంచి పుంజుకుంటుంది. మార్చి నుంచి  ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. అయితే ఈ ఏడాది మీకు అనుకూలమైన సంఖ్య కావడం అదృష్టం. దీనివల్ల అన్నింటా విజయాలు సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవివాహితులకు వివాహ యోగం. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు చేపడతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. అలాగే అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు.ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయితరచూ ప్రయాణాలు, తీర్థ యాత్రలు చేస్తారు. కొందరికి విదేశీ పర్యటన అవకాశాలుంటాయి. కళాకారులకు అవార్డులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. జులై, డిసెంబర్‌ నెలలు కొంత అప్రమత్తంగా మెలగండి. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి.

అదృష్ట సంఖ్య 9, సుబ్రహ్మణ్యారాధన మంచిది.