పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

cancer

01st Jan 2017   -    31st Dec 2017

 కర్కాటకం....(జూన్‌23–జూలై 22)

వీరికి అదృష్టం తలుపు తట్టినట్లే అనిపించినా అంత ఆశాజనకంగా ఉండదు. సాధించాలనుకున్న కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. పలుకుబడి, పరపతి పెంచుకుంటారు. వివాదాల నుంచి బయటపడేందుకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. ధైర్యం,సాహసాలతో ముందడుగు వేయండి. సెప్టెంబర్‌ నెల నుంచి అనుకూల  పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్ధులకు శ్రమానంతరం మంచి ఫలితాలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందడంతోపాటు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రధమార్ధంలో బదిలీలు. ద్వితీయార్ధంలో పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు గతం కంటే మెరుగుదల ఉంటుంది. నాయకులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు కొత్త అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వ్యవసాయదారులకు పంటలు ఆశాజనకంగా ఉంటాయి.

జులై, డిసెంబర్‌ నెలలు ఆరోగ్య విషయంలో కొంత మెలకువ అవసరం.

అదృష్ట సంఖ్య 2. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం  మంచిది.