పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Yearly Sunsign Horoscope

capricorn

01st Jan 2017   -    31st Dec 2017

 మకరం...(డిసెంబర్‌22–జనవరి 20)

వీరికి మార్చి తరువాత అన్నీ శుభాలే. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుందికార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఊరటనిస్తాయి. పెట్టుబడులకు ఢోకాలేదు. ఉద్యోగులకు శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది. పదోన్నతులు ఖాయం. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థలలో వాటాలు దక్కవచ్చు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. నాయకులకు పదవీయోగం. వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది.

అదృష్ట సంఖ్య 8. వీరు అమ్మవారికి తరచూ కుంకుమార్చనలు చేయడం మంచిది.