పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

gemini

01st Jan 2017   -    31st Dec 2017

 మిథునం..(మే 22–జూన్‌22)

ఈ రాశి వారు కొన్ని కొరకరాని సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు. లేనిపోని బాధ్యతలు మీదపడి తలనొప్పిగా మారవచ్చు. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. అవివాహితులకు వివాహ యోగం. సెప్టెంబర్‌నవంబర్‌ మధ్య కొత్త ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, తద్వారా స్థాన మార్పులు ఉండవచ్చు. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థలతో ఒప్పందాలు. రాజకీయ నాయకులకు ఏడాది మధ్యలో పదవీ యోగం. కళాకారుల యత్నాలలో అనుకూలత ఉంటుంది. వ్యవసాయదారులకు కొత్త పెట్టుబడులు. అక్టోబర్, డిసెంబర్‌ నెలలు కాస్త చికాకులు కలిగించవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు.

అదృష్ట సంఖ్య 5, అమ్మవారికి కుంకుమార్చనలు మంచి ఫలితాలనిస్తుంది.