పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Yearly Sunsign Horoscope

leo

01st Jan 2017   -    31st Dec 2017

 సింహం....(జూలై 23–ఆగస్టు 22)

వీరికి జనవరి చివరి నుంచి ఈతి బాధలు, సమస్యలు తొలగుతాయి. అనుకున్న రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరతాయి. కొన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కలసి వచ్చే కాలం. వ్యాపారులకు వద్దంటే లాభాలు అన్నట్లుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీయానం. కళాకారులు కొత్త అవకాశాలతో ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు ఆశాజనకంగా ఉంటుంది. నాయకులకు కొత్త పదవులు తథ్యం. మే, జూలై నెలలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పై దృష్టి పెట్టండి.

అదృష్ట సంఖ్య 1. గణేశ్‌ను అధికంగా పూజించండి.