పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Yearly Sunsign Horoscope

libra

01st Jan 2017   -    31st Dec 2017

 తుల....(సెప్టెంబర్‌23–అక్టోబర్‌22)

వీరికి ఈ ఏడాది పట్టింది బంగారమే. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఎంతటి వారినైనా మీ మాటలు,నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, ఈతి బాధలు తొలగుతాయి. పుణ్య క్షేత్రాల సందర్శనంతో ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కుతాయి. వ్యాపారస్తుల కృషి ఫలిస్తుంది. అనుకున్న లాభాలు తధ్యం. ఉద్యోగస్తులకు విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. కోరుకున్న విధంగా పదోన్నతులు. పారిశ్రామికవర్గాలు, నాయకులకు మంచి గుర్తింపు రాగలదు .వ్యవసాయదారులకు రెండు పంటలూ కలిసి వస్తాయి. కళాకారులకు పూర్వ వైభవం.

డిసెంబర్‌ నెలలో ఆరోగ్య,కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

అదృష్ట సంఖ్య 6. ఆదిత్య హృదయం, కనకధారా స్తోత్రం పఠించండి.