పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Yearly Sunsign Horoscope

pisces

01st Jan 2017   -    31st Dec 2017

 మీనం...(ఫిబ్రవరి 19–మార్చి 20)

వీరికి కొన్ని వ్యవహారాలలో అనూహ్యమైన విజయాలు వరిస్తాయి. బంధువులు మీ పై అపారమైన అభిమానం చూపుతారు. అనుకున్న రాబడి లభించి అవసరాలు తీరతాయి. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికం. కాంట్రాక్టర్లకు అన్నీ విజయాలే. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు, నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

అదృష్ట సంఖ్య 3. వీరు హనుమాన్‌ పూజలు చేయడం మంచిది.