పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

sagittarius

01st Jan 2017   -    31st Dec 2017

 ధనుస్సు...(నవంబర్‌23–డిసెంబర్‌21)

వీరు ఏడాది ప్రారంభంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మార్చి నుంచి అన్ని విషయాలలోనూ ముఖ్యంగా ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమించాల్సిన పరిస్థితి. పట్టుదల,శ్రమతో కొన్ని విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల విషయంలో తొందరపాటు వద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆశించిన పదోన్నతులు చేజారవచ్చు. పారిశ్రామికవర్గాలకు తరచూ ఇబ్బందులు, సమస్యలు. కళాకారుల యత్నాలు అతికష్టం మీద నెరవేరతాయి. నాయకులకు ఒత్తిడులు ఉన్నా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

అదృష్ట సంఖ్య 3. వీరు గణపతి హోమం నిర్వహిస్తే మంచిది.