పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

scorpio

01st Jan 2017   -    31st Dec 2017

 వృశ్చికం....(అక్టోబర్‌23–నవంబర్‌22)

వీరికి సెప్టెంబర్‌ వరకు ఇబ్బందులు అంతగా ఉండవుఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల చేయూతతో  సమస్యలు పరిష్కరించుకుంటారు. భవిష్యత్‌ పై ఆశలు చిగురిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగి కొన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందుల నుంచి విముక్తి. కళాకారులకు అవార్డులు, మంచి గుర్తింపు. సెప్టెంబర్‌ నెలలో ఆరోగ్య,కుటుంబ సమస్యలు. లేనిపోని వివాదాలు.

అదృష్ట సంఖ్య 9. పార్వతీ దేవికి కుంకుమార్చన చేయండి.