పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Yearly Sunsign Horoscope

taurus

01st Jan 2017   -    31st Dec 2017

 వృషభం....(ఏప్రిల్‌21–మే 21)

రాశి  వారు పట్టువిడుపు ధోరణి అవలంభించడం ఉత్తమం. అనుకున్న కార్యాలు పూర్తి చేసేందుకు శ్రమించాల్సి ఉంటుంది. అనుకున్న ఆదాయం దక్కినా లేనిపోని ఖర్చులు మీదపడతాయి. ప్రత్యర్థులు, దూరపు బంధువులతో మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చు. తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. మార్చి నుంచి కొంత అనుకూలత కనిపిస్తుంది. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ఏడాది మధ్యలో సఫలమయ్యే సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కినా సంతృప్తికరంగా ఉండవు. విద్యార్థులకు  శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వ్యాపారులకు సామాన్యమైన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు అనుకున్న చోటుకు బదిలీలు. పారిశ్రామికవేత్తలకు మార్చి తరువాత యత్న కార్య సిద్ధి. రాజకీయ నాయకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. చివరిలో పదవీ యోగాలు. కళాకారులు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుందిఈ ఏడాది కొంత ప్రతికూల వాతావరణం ఉంటుందనే చెప్పాలిఆగస్టు, డిసెంబర్‌ నెలల్లో వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఉదర సంబంధ రుగ్మతలు బాధించ వచ్చు.

అదృష్ట సంఖ్య 6, అనుకూలం 5,8, 9. రుద్రాభిషేకం మంచిది.