పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Aquarius

కుంభం

వీరికి సెప్టెంబర్‌12 వరకు అష్టమ గురు దోషం కొంత ఇబ్బందికరం. శని అనుకూలుడు. రాహు, కేతువులు సామాన్యమైన ఫలితాలు ఇస్తారు.  మొత్తం మీద అనుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.  సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఊహించని రీతిలో ధన, ఆస్తి లాభాలు ఉండవచ్చు.  అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు.  తండ్రి తరఫు వారితోనూ, జీవిత భాగస్వామితోనూ విభేదాలు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం సెప్టెంబర్‌ తర్వాత కొలిక్కి వచ్చే అవకాశముంది. ఇక అష్టమ గురు దోషం కారణంగా సెప్టెంబర్‌ వరకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు సెప్టెంబర్‌ నుంచి అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. అదనపు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. వైశాఖం, శ్రావణం, కార్తీకం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

గురు దోష నివారణకు పరిహారాలు, ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.. అదృష్ట సంఖ్య...8  మిగతావి సామాన్యం.

ఆదాయం–11, వ్యయం–5

రాజపూజ్యం–2, అవమానం–6

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces