పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Aquarius

కుంభం

ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం –7, అవమానం–5.

వీరికి గ్రహబలం విశేషంగా ఉంది. రాహుకేతువుల స్వల్పదోషకారులైనా శని, గురుబలం విశేషం. ఈరీత్యా వీరికి పట్టింది బంగారమే.  ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. అయితే శుభమూలక ధనవ్యయం అధికంగా ఉంటుంది. అలాగే, సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. పట్టుదల, నేర్పుతో ఎంతటి వ్యవహారమైనా పూర్తి చేస్తారు.  మీ సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. బంధువులు, మిత్రులు ఊహించని రీతిలో సహకారం అందిస్తారు.  పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు.  కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.  గృహ నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు.  తీర్థయాత్రలు సాగిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది.  కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సన్మాన, సత్కారాలు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు తథ్యం. క్రీడాకారులకు విజయాలు వరిస్తాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి.  వైద్యులు, న్యాయవాదులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వీరికి ఏడాదంతా స్వల్ప దోషాలు ఉన్నా శుభసూచకాలే అధికంగా ఉంటాయి. 

అదృష్ట సంఖ్య–8

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces