పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Cancer

కర్కాటకం

ఆదాయం–8, వ్యయం–2 , రాజపూజ్యం–7, అవమానం–3.

వీరికి గురుడు, శని బలం కలదు. రాహుకేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి ఇతరుల నుంచి అందాల్సిన సొమ్ము అందుతుంది.  ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.  కార్యజయం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే, ఆస్తుల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. చాకచక్యం, నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. మీ పై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం పరిష్కారమవుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. నూతన గృహప్రవేశ యోగం. విద్యార్థులకు కోరుకున్న ర్యాంకులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగస్తులు ఆశించిన బదిలీలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, పరిశోధకులకు విశేషయోగదాయకమైన కాలం. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త పదవులు దక్కించుకుంటారు. కళాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. 

రాహుకేతువుల సంచారం అనుకూలం కానందున ఆరోగ్యం, కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యయప్రయాసలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు. మొత్తం మీద శుభఫలితాలే ఎక్కువగా కనిపిస్తాయి. 

అదృష్ట సంఖ్య–2

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces