పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Capricorn

మకరం

వీరికి శని, రాహు దోషాలు ఉన్నా గురుని శుభకారకత్వం ఉపకరిస్తుంది. జూన్‌–అక్టోబర్‌మధ్య శని లాభ స్థానంలో సంచారం లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదల, నేర్పుతో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కొన్ని విజయాలు సాధిస్తారు. బంధువులు మీ పట్ల కొంత వ్యతిరేకత చూపవచ్చు. స్నేహితులు, శ్రేయోభిలాషులు సహాయసహకారాలు అందిస్తారు. ఆదాయం సమకూరినా అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పవు. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ప్రథమార్థంలో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన చికాకులు, ఆగస్టు వరకూ వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు సామాన్య లాభాలు దక్కించుకుంటారు. కొత్త పెట్టుబడులు ఆలస్యమవుతాయి.  ఉద్యోగస్తులు విధుల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరికి బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకమే. రాజకీయవర్గాలు అనుకున్న పదవులు దక్కక కొంత అసంతృప్తి చెందుతారు. కళాకారుల యత్నాలు కొంతమేరకు సఫలమవుతాయి. విద్యార్థుల కృషి సఫలమవుతుంది. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి. చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం.  

శని, రాహు, కేతువులకు పరిహారాలు గణపతికి అభిషేకాలు చేయించుకుంటే మంచిది. మిగతావి సామాన్యం.

అదృష్ట సంఖ్య–8

సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలం.

ఆదాయం–11 వ్యయం–5

రాజపూజ్యం–2, అవమానం–6

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces