పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Capricorn

మకరం

ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం–4, అవమానం–5.

ఈరాశి వారికి గురు బలం విశేషం. ఏల్నాటిశని, సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతు సంచారం దోషం. ఈ రీత్యా చూస్తే వీరికి ఆర్థికంగా బలం చేకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.  మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత మనస్థాపం కలిగించవచ్చు.  గురుబలం కారణంగా ఆర్థిక లాభాలు, ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ అభిరుచులు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.  సంఘంలో గౌరవం పెరుగుతుంది.  చిరకాలంగా ఎదురవుతున్న ఇక్కట్లు తొలగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి.  వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు విశేషంగా కలసివస్తుంది. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు.  విద్యార్థులు ఏల్నాటి శని ఉన్నా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.  న్యాయవాదులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విశేష సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు.  క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి.

కాగా, శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది చివరిలో సమస్యలు తప్పకపోవచ్చు.

అదృష్టసంఖ్య–8

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces