పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Leo

సింహం

ఆదాయం –11, వ్యయం–11, రాజపూజ్యం–3, అవమానం–6.

ఈరాశి వారికి అక్టోబర్‌వరకు గురు బలంలేదు. అలాగే, శని, రాహువులు దోషకారులు. ఆదాయానికి సరిసమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. పొదుపు చేసినది కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సోదరులు, సోదరీలతో కలహాలు. సంతానరీత్యా చిక్కులు ఎదురవుతాయి.  కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.  ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. మితాహారం, మిత సంభాషణ మంచిది. ఎదుటవారి విషయాలలో జోక్యం వల్ల మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పించలేవు. శత్రువులు మీ పై ఒత్తిడులు పెంచుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగానే లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో చికాకులు.  ఉద్యోగులకు ఊహించని బదిలీలు తథ్యం. అలాగే, పదోన్నతులు ఊరిస్తాయి.  విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అక్టోబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించుకుని నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది.

అక్టోబర్‌ నుంచి గురుడు కొంత అనుకూలం. గృహ నిర్మాణాలు చేపడతారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రత్యర్థుల సహాయం సైతం అందుతుంది. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అపవాదులు తొలగుతాయి. 

అదృష్టసంఖ్య–1

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces