Yearly moonsign horoscope
18th March, 2018 to 05th April, 2019
Pisces
మీనం
ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1.
వీరికి అక్టోబర్ 11 వరకు అష్టమ గురు దోషం అధికం. తదుపరి శుభదాయకం. ఇక శని, రాహుకేతువుల సంచారం దోషకారకం. మొత్తం మీద అక్టోబర్ వరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు. మిక్కిలి ఆప్తులతోనే మాటపడాల్సిన పరిస్థితి. అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. స్థిరాస్తి విషయంలో బంధువర్గంతో తగాదాలు నెలకొనవచ్చు. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించడం మంచిది. తరచూ దూరప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తుసామగ్రి జాగ్రత్తగా చూసుకోండి. సంతానమూలక సమస్యలు. మనోక్లేశాలు. వృథా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పై స్థాయి అధికారులరీత్యా ఒత్తిడులు. రాజకీయనేతలకు పదవులు ఊరిస్తాయి. శాస్త్రసాంకేతిక రంగాలు, పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం ఆలస్యమవుతుంది. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. కళాకారులకు గుర్తింపుతో పాటు, వ్యయప్రయాసలు కూడా తప్పవు.
అక్టోబర్నుంచి గురుని శుభసంచారం వల్ల ధనప్రాప్తి. వాహన, గృహయోగాలు. మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.
అదృష్ట సంఖ్య–3