పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Scorpio

వృశ్చికం

వీరికి ఏల్నాటి శని దోషం ఉన్నా సెప్టెంబర్‌ వరకు గురు బలం కొంత ఉపకరిస్తుంది. ఆగస్టు నుంచి రాహువు కొంత యోగాన్నిస్తాడు. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది.  అదనపు ఆదాయం సమకూరుతుంది. అయితే లేనిపోని ఖర్చులు మీదపడతాయి. తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు  లాభించే అవకాశముంది. ఇంటిలో శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పక పోవచ్చు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. మిత్రులు, సన్నిహితులతో కొన్ని సందర్భాలలో అకారణంగా వైరం. వాహనాలు, భూములు కొనుగోలుకు చేసే యత్నాలు కొంత మేరకు సఫలం. ఆపన్నులకు స్నేహ హస్తం అందిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  సోదరుల ద్వారా సహాయం అందుతుంది. విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి.  నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం. శాస్త్రసాంకేతిక రంగాల వారు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్య పదోన్నతులు  దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. కొత్త సంస్థలకు అనుమతులు లభిస్తాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు దక్కవచ్చు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొత్త అవకాశాలు. విద్యార్థుల యత్నాలు ప్రారంభంలో ఫలిస్తాయి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. రెండవ పంట లాభిస్తుంది. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని జన్మరాశి సంచారంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానరీత్యా చికాకులు. స్వల్ప అనారోగ్యం. అనుకున్న కార్యాలలో ఆటంకాలు. చైత్రం, జ్యేష్ఠం, భాద్రపదం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, రుద్ర జపం, రుద్రాభిషేకాలు మంచిది.

అదృష్ట సంఖ్య–9, ఆది, మంగళ

గురువారాలు అనుకూలం.

ఆదాయం–5, వ్యయం–5

రాజ పూజ్యం–3, అవమానం–3

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces