పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Scorpio

వృశ్చికం

ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–5, అవమానం–2.

వీరికి గురుబలం లేదు. అలాగే, ఏల్నాటి శని ప్రభావం వల్ల శని దోషకారి.  సంవత్సరాంతంలో అతిచారం వల్ల గురుడు ద్వితీయరాశి (ధనుస్సు) సంచారం కొంత ఉపకరిస్తుంది. ఈరీత్యా చూస్తే వీరికి సామాన్యంగానే ఉంటుంది. రావలసిన సొమ్ము అందక రుణదాతలను ఆశ్రయిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలను కాపాడుకుంటూ జీవనం సాగిస్తారు. ఆప్తులు, కావలసిన వారే మిమ్మల్ని ద్వేషిస్తారు.  ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా నరాలు, చర్మ, నేత్ర సంబంధిత వ్యాధులు బాధిస్తాయి.  బంధువులతో తరచూ విభేదాలు ఏర్పడవచ్చు.  ప్రతి వ్యవహారంలోనూ అత్యంత జాగరూకతతో మెలగాలి. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార, వాణిజ్యవర్గాలు సామాన్యమైన లాభాలు పొందుతారు.  ఉద్యోగులకు అనుకోని విధంగా బదిలీలు ఉండవచ్చు. వీటి వల్ల శ్రమాధిక్యం.  పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల వారు ఎంతగా కష్టపడ్డా ఫలితం దక్కదు.  కళాకారులు అనుకున్న అవకాశాలు  దూరం చేసుకుంటారు. ప్రయత్నాలు విఫలమవుతాయి. రాజకీయవర్గాలకు అపవాదులు, ఆరోపణలు తప్పకపోవచ్చు.  న్యాయవాదులు, క్రీడాకారుల అంచనాలు తప్పుతాయి. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.  ఏడాది చివరిలో కాస్త ఊరట లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి. శుభవార్తలు. ఆకస్మిక ధనప్రాప్తి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. 

అదృష్టసంఖ్య–9

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces