పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Virgo

కన్య

వీరికి సెప్టెంబర్‌ నుంచి గురువు, ఆగస్టు నుంచి రాహువు అనుకూలురు. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని యోగదాయకుడు. తదుపరి సంవత్సరాంతం వరకూ శని అర్థాష్టమ స్థానంలో సంచారం.  సెప్టెంబర్‌ వరకూ అనుకున్న కార్యాలలో విఘ్నాలు. బంధుమిత్రులతో విభేదాలు నెలకొంటాయి. శ్రమ వృథా కాగలదు.  కోర్టు కేసులు, ఆస్తి వివాదాల నుంచి కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు సొమ్ము అందడం కొంత ఊరటగా చెప్పవచ్చు. సెప్టెంబర్‌ నుంచి గురువు, ఆగస్టు నుంచి రాహువుల బలం కారణంగా కార్యజయం. శుభకార్యాల నిర్వహణ, ఆకస్మిక ధన లబ్ధి వంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి. సమర్థత చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.  రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  పారిశ్రామికవర్గాల వారు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి.  శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. కళాకారులకు సంతోషకరమైన సమాచారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వ్యవసాయదారులకు లాభసాటిగానే ఉంటుంది. అక్టోబర్‌ నుంచి తిరిగి అర్ధాష్టమ శని వల్ల ఈతి బాధలు, మానసిక అశాంతి. కుటుంబంలో కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, కార్తీక మాసాలు అనుకూలం, మిగతావి సామాన్యం.

వీరు గురు, శనులకు పరిహారాలు చేయించుకోవాలి. తిల దానం మంచిది.

అదృష్ట సంఖ్య–5, సోమ, గురు

శనివారాలు అనుకూలం. 

ఆదాయం–2, వ్యయం–11

రాజపూజ్యం–4, అవమానం–7

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces