పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Aquarius

కుంభం...(జనవరి 21–ఫిబ్రవరి 18)

వీరికి ఏడాదంతా పట్టింది బంగారమే. ఆర్థికంగా పురోగతితో పాటు, హఠాత్తుగా ధన లాభాలు కలుగుతాయి. వ్యవహారాలలో ఎల్లప్పుడూ ముందడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖుల నుంచి సందేశాలు అందుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ఎన్నడూ లేనంత ప్రేమానురాగాలు కలుగుతాయి. ఆస్తుల విషయంలో వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు సంతోషకరమైన సమాచారం. లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు,రాజకీయవేత్తలకు అనుహ్యమైన రీతిలో ప్రగతి ఉంటుంది. కళాకారులకు అవార్డులు తథ్యం. క్రీడాకారులు, రియల్‌ఎస్టేట్‌వర్గాలకు ఊహించని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది.

 మార్చి, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్‌నెలలు ప్రతికూలం. ఈకాలంలో ఈతిబాధలు, మనోధైర్యం తగ్గుదల, అనారోగ్య సూచనలు.

అదృష్ట సంఖ్య–8,

ప్రతి శుక్రవారం దుర్గామాతకు కుంకుమార్చన చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces