పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Aries

మేషం...(మార్చి 21–ఏప్రిల్‌20)

ఈ రాశివారు అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.ఇంతకాలం పడిన కష్టం, కృషి ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఆర్థికంగా సెప్టెంబర్‌వరకూ పర్వాలేదు. ఆ తరువాత సంవత్సరాంతం వరకూ ఇబ్బందులు. రుణయత్నాలు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఒక శుభవార్త లేదా వర్తమానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సోదరీలు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. అలాగే, భార్యాభర్తల మధ్య ఇంతకాలంగా ఎదురవుతున్న వివాదాలు సర్దుబాటు కాగలవు. బంధుమిత్రులతో ఇష్టాగోష్టి చర్చలు జరుపుతారు. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు మరింత ప్రోత్సాహం, నూతన పెట్టుబడులకు అవకాశాలు. రాజకీయవర్గాలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలోకదలికలు ఉంటాయి. విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో విజయాలు, ర్యాంకులు సాధిస్తారు. క్రీడాకారులు మంచి గుర్తింపు పొందుతారు.

మార్చి, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌నెలలు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా మెలగడం మంచిది. కాలం ఆరోగ్య, కుటుంబ సమస్యలు, మనోవేదన, ఇంటాబయటా ప్రతికూలత.

అదృష్ట సంఖ్య–9,

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces