పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Pisces

 మీనం...(ఫిబ్రవరి 19–మార్చి 20)

ఎంతటి పనులైనా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భవిష్యత్‌ పై కించిత్తు ఆందోళన నెలకుంటుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకులోటు ఉండదు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి చెప్పుకోతగ్గ ప్రగతి కనిపించినా కొంత ఆందోళన సైతం తప్పదు. వివాహా యత్నాలు ఫలిస్తాయి. కొందరికి నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

 ఫిబ్రవరి ,ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్‌నెలలు ప్రతికూలం. ఈ కాలంలో వ్యయప్రయాసలు. విరోధాలు. చోరభయం వంటి ఫలితాలు ఉంటాయి.

అదృష్ట సంఖ్య–3,

వీరు ఏకాగ్రతతో నిత్యం గణేశ్‌స్తోత్రాలు పఠిస్తే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces