పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Scorpio

 వృశ్చికం....(అక్టోబర్‌23–నవంబర్‌22)

వీరికి సెప్టెంబర్‌ వరకు ఇబ్బందులు అంతగా ఉండవు.  ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల చేయూతతో  సమస్యలు పరిష్కరించుకుంటారు. భవిష్యత్‌ పై ఆశలు చిగురిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగి కొన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందుల నుంచి విముక్తి. కళాకారులకు అవార్డులు, మంచి గుర్తింపు. సెప్టెంబర్‌ నెలలో ఆరోగ్య,కుటుంబ సమస్యలు. లేనిపోని వివాదాలు.

అదృష్ట సంఖ్య 9. పార్వతీ దేవికి కుంకుమార్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces