పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Virgo

కన్య.....(ఆగస్టు 23–సెప్టెంబర్‌22)

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు చాలావరకూ సర్దుబాటు కాగలవు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మరింత దగ్గరవుతారు. ఒక లేఖ లేదా సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో హౌదా, గౌరవం పెరుగుతాయి. కార్యోన్ముఖులై విజయాలు సాధించి అందర్నీ ఆకట్టుకుంటారు. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు అన్ని విధాలా సహకరిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. అగ్రిమెంట్లలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు అవార్డులు పొందుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

మార్చి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌నెలలు ప్రతికూలం. వ్యవహారాలలో ప్రతిబంధకాలు, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

అదృష్ట సంఖ్య–5

వీరు నవగ్రహ ప్రదక్షణలు చేయడం ఉత్తమం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces