మేషం
కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు.
అలుపెరుగకుండా అనుకున్న లక్ష్యాల కోసం శ్రమిస్తారు.
నిర్ణయాలు కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు.
భూవివాదాలు నెలకొంటాయి.
కుటుంబసభ్యుల నుంచి సమస్యలు అ«ధికం కాగలవు.
వాహనాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే.
ఉద్యోగులకు బాధ్యతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిదానం పాటించాలి.
విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత.
అనుకూల రంగులు...... ఆకుపచ్చ, బంగారు.
ప్రతికూల రంగు...నేరేడు.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.