వృషభం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.
వ్యతిరేకవర్గానికి చెందిన వారు కూడా మీపట్ల ఆదరణ చూపుతారు.
భూములుపై ఎంతోకాలంగా నలుగుతున్న వివాదం పరిష్కరించుకుంటారు.
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.
ఒక సమాచారం ఊరటనిస్తుంది.
ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు.
ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు నిర్ణయాలు కలసి వస్తాయి.
ఉద్యోగులకు ఒక కీలక సందేశం అందుతుంది.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.
మహిళలకు ఇంటి సమస్యలు తీరతాయి.
అనుకూల రంగులు... గులాబీ, లేత పసుపు.
ప్రతికూల రంగు...ఎరుపు.
విష్ణు ధ్యానం చేయండి.