కన్య
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది.
మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
కొన్ని వివాదాలు మరింత నేర్పుగా పరిష్కరించుకుంటారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు రాగలవు.
ఉద్యోగులకు విధి నిర్వహణపై కొంత ఆందోళన.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సమస్యలతోనే గడుపుతారు.
విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.
మహిళలకు కొంత ఆస్తిలాభం.
అనుకూల రంగులు... కాఫీ, పసుపు.
ప్రతికూల రంగు...నీలం.
ఆదిత్య స్తోత్రాలు పఠించండి.