మేషం
వీరికి ప్రారంభంలో విశేషంగా కలిసివచ్చే సమయం.
ఏ కార్యక్రమమైనా స్వయంగానే పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, బంధువుల సహాయసహకారాలు అందుకుంటారు.
అనుకున్నంత రాబడి కలిగి అవసరాలు తీరతాయి.
చిరకాల ప్రత్యర్థులను సైతం మాటలతో ఆకట్టుకుంటారు.
పరిచయాలు మరింత పెరుగుతాయి.
ఆస్తులు వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టి మానసిక ప్రశాంతత పొందుతారు.
మీ ఉద్దేశాలను ఆప్తులతో పంచుకుంటారు.
వృత్తులు, వ్యాపారాలలో ఉన్న వారికి పట్టింది బంగారమే.
ముఖ్యంగా వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.
రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.
క్రీడాకారులు, వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి.
మహిళలు తమ సత్తా చాటుకుంటారు.
వారం చివరిలో ముఖ్య కార్యాలు కొంత నిదానంగా సాగుతాయి.
ఆదాయం, వ్యయాలు సమానంగా ఉంటాయి.
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ముఖ్యంగా ఆరోగ్యంపై తగు శ్రద్ధ చూపండి.
అశ్వని నక్షత్రం వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.
శ్రీ దత్త స్తోత్రాలు పఠించండి.