ధనుస్సు
చీటికీమాటికీ వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది.
ఆదాయం కొంత పెరుగుతుంది.
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా కొనసాగుతాయి.
విద్యార్థులకు మరింత అనుకూల సమయం.
మంచి ఫలితాలు రాబడతారు.
పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.
సేవాకార్యక్రమాలను నిర్వహిస్తారు.
దైవరాధనలో పాలుపంచుకుంటారు.
బంధువులు మిమ్మల్ని మెచ్చుకుంటూ అభినందనలు కురిపిస్తారు. వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి.
ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు.
రచయితలు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.
వారారంభంలో ఆస్తి వివాదాలు.
స్వల్ప శారీరక రుగ్మతలు.