ఆశ్వయుజ మాసం
హిందువులకు ముఖ్యమైన మాసాలలో ఆశ్వయుజ మాసం ఒకటైనది. శరన్నవరాత్రులతో మొదలయ్యే ఈ మాసం లో తొమ్మిది రాత్రులు అమ్మవారి ని పూజించితే సంవత్సరమంతా పూజించిన ఫలితం కలుగుతుంది కనుక ఈ విధానాన్ని మహర్షులు గ్రహించారు.
నక్షత్రాలలో మొదటిది అశ్వని ఈ నక్షత్రం లో పూర్ణిమ వచ్చే నెల ఆశ్వయుజం. అపార దైవిక శక్తి సమీకరణకు, మానవుల బలహీనతలైన కామ, క్రోధ, మొహం వంటి మనోవికారాల నియంత్రణకు నవరాత్రి పర్వదినాలు ఉపయోగపడతాయి. జ్యోతిష్య శాస్త్రం, భౌగోళిక పరిస్థితులను అనుసరించి శరన్నవరాత్రులు మహా పర్వదినాలుగా పరిగణింపబడ్డాయి. శక్తి ఉపాసన ద్వారా ఆశక్తను వీడి జీవనం సాగించాలని తెలియ చెప్పే మహాపర్వదినాలే శరన్నవరాత్రులు. వసంత ఋతువు, శరదృతువు యమద్రష్టల వంటివి. రోగ పీడలు వ్యాపించే ఋతువులు, జననాశనం అధికంగా ఉంటుంది. అందుకే ఈ రెండు ఋతువులలో అమ్మవారి ఆరాధన ఉంటుంది.
ఈ సమయాలల్లో సూర్యభగవానుడు కర్కాటక లేదా మకరరేఖ వైపునకు తన దిశను మార్చుకొని పరివర్తనం చెంది, భూమధ్య నుండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు, తద్వారా ప్రకృతిలో అనేక మార్పులు ఋతువుల రూపం లో వ్యక్తమవుతాయి. ఆశ్వయుజ మాసం లో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితి లో ఉండటం వల్ల ఆరోగ్య, ప్రాణ హాని కలిగించే అనేక దుష్ట శక్తులు విజృమ్బిస్తుంటాయి. ప్రకృతిలోని మార్పులకు అనుగుణం గా మానవ శరీరం మనసు ప్రభావితమవుతాయి. అందువల్ల నవరాత్రులలో సాత్వికాహారం తీసుకొవాలి. ఉపవాసం ఉండాలి. భగవంతుని సమక్షం లో పూజాపత్రాది రూపకంగా సమయాన్ని గడుపుతూ మనసు నిర్మలం గా ఉంచుకోవడం వల్ల శారీరిక, మానసిక వికారాలు దరిచేరవు. శరీరం వ్యాది గ్రస్తం కాదు.
శరన్నవరాత్రులు మహా లయం (భాద్రపద అమావాస్య) తరువాత ఆరంభమవుతాయి. ఈ తొమ్మిది రోజులు అన్ని విజయాలను ప్రసాదించాలని అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు.
ఒకవేళ తొమ్మిది రోజులు నిత్య పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి మూడు రోజుల్లోనైనా పూజ చేయాలి. అసలు విజయ దశమి అంటే దీనిని సంధ్యాకాలం తర్వాత చుక్కలు పొడవడం చుసిన తర్వాత సర్వ కార్యక్రమాలు సిద్ధింపచేయునదిగా అభివర్ణిస్తారు.
విజయ దశమి రోజున ఎటైన వేరే ప్రదేశానికి ప్రయాణం చేయడం ఆనవాయితీ. దీనినే "సీమోల్లంఘనం" అంటారు. ఒక వేళ పండుగ రోజు ఎవరైనా ప్రయాణం చేయడం సాధ్యం కాకపొతే కనీసం వారికి సంబంధించిన ఏవైనా వస్తువులను పక్కింట్లోనో, ఎదిరింట్లోనో అయినా పెట్టాలని పండితులు చెప్తారు. ఈ విధం గా చేయడం ద్వారా వారు ఆ రోజు ప్రయాణం చేసినట్లుగా పరిగణింపబడుతుందంటారు.
ఆశ్వయుజ కృష్ణచతుర్దశి, అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ తమ ఇళ్ళలో దీపాలతో పండుగ జరుపుకొంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడు ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీ తిల తైలం లో ఉంటుందనీ, తలంటి స్నానం చేయడం లక్ష్మీప్రదమని ఈనాటి స్నానం గంగా స్నానం తో సమానమని శాస్త్ర వచనం, లక్ష్మీ దేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రం గా ఉన్న ఇంట్లో తన కళను నిక్షిప్తం చేస్తుందని, భక్తి శ్రద్దలతో పూజించి ఎవరైతే దీపాలతో స్వాగతించి దారి చూపి ఆహ్వానిస్తారో వారి పై ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుంది అని భక్తుల విశ్వాసం. దీపాలు సమృద్దిగా వెలిగే ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది. అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని విస్తరింపజేసే పండుగగా దీపావళి ని హిందూ సంస్కృతి భావిస్తుంది.
https://www.blowjobvideos.xxx/categories/421/monster-cock