మేషం
కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు.
ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
పండితులు, స్వామీజీలను కలుసుకుంటారు.
ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగించవచ్చు.
కాంట్రాక్టర్లకు శుభదాయకమైన కాలంగా చెప్పాలి.
పడిన కష్టం కొలిక్కి వచ్చి నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.
ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి.
సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
వాహనాలు కొనుగోలు చేస్తారు.
అవసరాలు ఏమైనా తగినంత డబ్బు సమకూరుతుంది. ముఖ్యంగా ఆస్తుల విక్రయాల వల్ల అనూహ్యంగా ధనం చేకూరుతుంది.
కుటుంబంలోని వారు మీరంటే ఇష్టపడతారు. వివాహాలు ఇతర వేడుకల నిర్వహణ పై అందరితో చర్చిస్తారు.
ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు.
వ్యాపారాలలో మరింత లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులకు ఢోకాలేదు. అలాగే, విస్తరణలోనూ ముందడుగు వేస్తారు.
ఉద్యోగాలను నేర్పుగా విధులు నిర్వహించి సత్తా చాటుకుంటారు.
ప్రమోషన్లు దక్కవచ్చు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలు వరిస్తాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పఠించండి.