మిథునం
కొన్ని కార్యాలు నిదానంగా సాగుతాయి.
పట్టుదల పెరుగుతుంది.
కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి.
ఆదాయం సంతృప్తినిస్తుంది.
అప్పుల బాధలు తొలగుతాయి.
కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.
వాహనాలు కొనుగోలు చేస్తారు.
నిరుద్యోగుల యత్నాలలో కదలికలు కనిపిస్తాయి.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు.
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహకరించడం విశేషం.
ఆహ్వానాలు అందుకుంటారు.
వివాహాది యత్నాలు కలసివస్తాయి.
వ్యాపారాలు గతం కంటే కాస్త అనుకూలిస్తాయి.
ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే అవకాశం.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు.
వారం మధ్యలో దూర ప్రయాణాలు.
ఖర్చులు అధికమవుతాయి.