వృషభం...
-------
కొత్త కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయాల సొంతం చేసుకుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది.
మీ అంచనాలకనుగుణంగా బాధ్యతలను క్రమపద్ధతిలో నెరవేరుస్తారు.
అనూహ్యంగా సొమ్ము సమకూరుతుంది. రుణబాధలు తగ్గి ఊరట చెందుతారు.
వ్యాపారాలలో మరింత పుంజుకుని లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు.
ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పైస్థాయి వారి నుంచి కొంత సహాయం అందుతుంది.
రాజకీయవేత్తలు, కళాకారులకు సంతోషకర సమాచారం.
శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.