సోమవతి అమావాస్య విశిష్ఠత మరియు పాటించవలసిన పరిహారాలు
అమావాస్య తిథి సోమవారం ఉన్నప్పుడు సోమవతి అమావాస్య అంటారు. జ్యోతిష్యపరం గా చంద్రునికి ప్రముఖ స్థానం కలిగి ఉండడం, చంద్రుడు మనః కారకుడు కావడం విశేషం గా చెప్పబడింది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క ప్రభావం మనసు పై, ఆలోచనల పై స్పష్టం గా ఉంటుంది. జాతకరీత్యా చంద్రుని స్థితి బాగోలేక పోతే మానసిక సమస్యలు, అస్థిరమైన ఆలోచనలు, ప్రతి చిన్న విషయానికి నిరాశ పడిపోవడం ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా ఒకే సమయం లో ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు, సోమవతి అమావాస్య రోజున వారి శక్తి కొద్దీ పరిహారాలు పాటించి మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రోజు చంద్రునికి చేసే పూజలు దానాల వలన చెడు ఫలితాలు నశించి , నూతనోత్సాహం శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది.
నదీ స్నానం ఆచరించడం అవకాశం లేనప్పుడు స్నానం చేసే నీటి లో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం ఆచరించడం వలన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ రోజున శివుడికి పాలు మరియు గంధం తో అభిషేకం చేసి పూజించడం, శివాలయం లో చేసే ప్రదక్షిణాలు విశేష ఫలితాలనిస్తాయి. తులసి పూజ, ముఖ్యం గా తులసి కోటకి ప్రదక్షిణలు చేయడం, సూర్యాష్టకం పఠించి సూర్యుని కి అర్ఘ్యం ఇవ్వడం మంచి ఫలితాలనిస్తుంది.
పితృ దేవతలను స్మరించుకోవడం తర్పణాలు వదలడం పుణ్యఫలితాన్నిస్తుంది. ఈరోజు రావి చెట్టు కింద దీపం పెట్టి పూజించడం వలన శని గ్రహ బాధలు కూడా తొలగుతాయి. రావి చెట్టు కి ప్రదక్షిణాలు చేసి పక్షులకు ఆహారం వేయడం వలన సంతానం కలగడానికి ఆటంకాలు ఉన్నవారి దోషాలు తొలగుతాయి.
గంధం, అక్షింతలు, పాలు, పూలు కలిపిన నీటిని రావి చెట్టు మొదల్లో పోయాలి. ప్రదక్షిణలు చేసి దాంపత్య జీవితం చక్కగా సాగాలని. సుమంగళత్వం వర్దిల్లాలని పెళ్ళైన స్త్రీలు పూజించాలి.
ఈ రోజున చక్కెర, బియ్యం, పాలు, నెయ్యి, పెరుగు వంటి పదార్థాలను దానం చేయడం వలన గ్రహ సంబంధిత సమస్యలు తొలగుతాయి. ముఖ్యం గా బ్రాహ్మణులకి భోజనం పెట్టడం పుణ్యప్రదం గా చెప్పబడింది. Gf Porn Collection https://www.watchmygf.xxx/ watch online.